షార్ట్ మూవీస్ కోసం రివ్యూలు రాయవచ్చా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే , చిత్త శుద్ధితో సినిమా మీద ఉన్న ప్రేమ తో , ఖాళీ లేని ఈ బిజీ రోజుల్లో ఎంతో ఓర్పుతో ఈ సినిమా ను తీసిన ఆ టీము కు హృదయ పూర్వకమైన వందనాలు . టాటా సుమో లు గాల్లో పేలిపోవటాలు, వంశాల కోసం సెల్ఫ్ డబ్బాలు , కోట్ల బడ్జెట్ తో తీసి చివరకు నాలుగు రోజులకే డిస్ట్రి బ్యుటర్లను ముష్టి వాళ్ళు గా మార్చే పెద్ద సినిమాల కన్నా ఈ సినిమా ఎన్నో రకాలుగా మేలు .
లోట్లు వెతకాలంటే వెయ్యి ఉండొచ్చు . రంద్రాన్వేషణ మానేసి ప్రయత్నాన్ని అభినందిస్తే మంచి సినిమాలు తీయాలనే ఒక తపను ప్రోత్సహించే వాళ్ళలో మనమూ ఒకరం అవుతాం .
ఈ సినిమా కధను నేను ఇక్కడ ప్రస్తావించ దలచుకోలేదు . దయచేసి youtube లో 5 భాగాలను చూడండి .
link : http://youtu.be/0laHGh8JW2o .
మంచి ఆడియో సిస్టం పెట్టుకుని చూస్తే మీకు మంచి సినిమా చూసిన ఫీలింగ్ గారంటీ . మనం స్టార్ హోటల్ కు వెళ్ళబోయి ఏదో కారణంతో పక్కనే ఉన్న కాకా హోటల్ కు వెళ్ళితే , అక్కడ స్టార్ హోటల్ కన్నా మంచి భోజనం ( రుచి కరమైన ) దొరుకుతుంది . అనుకోకుండా ఇలాంటి సినిమాలు చూస్తే ( షార్ట్ ఫిలిం అయినా సినిమాలకు ఎక్కడా తీసిపోలేదు ) అలాంటి ఫీలింగ్ కలుగుతుంది .
ఇందులో ముఖ్యముగా ప్రశంసించవలసిన వలసిన వ్యక్తులు నలుగురు . ఒకరు కామెర మాన్ విక్టర్ . రెండవది మ్యూజిక్ ఇచిన శ్రవణ్. మూడవది క్రాంతి కుమార్ - చాలా చక్కగా డైరెక్షన్ చేసారు . మంచి ఎతుగడ ఉన్న కధను ఎన్నుకోవటం ఒక ఎత్తు , పరిమితమైన వనరులతో దానిని తెరకు ఎక్కించటం ఇంకో ఎత్తు . ఇక నాల్గవది రఘు . ఒక్క డైలాగ్ మాడ్యులేషన్ తప్ప నటనా పరంగా చాలా చక్కటి ప్రతిభ చూపించాడు . చాల నాచురల్ గా ఇతనికి సీన్లు సరిపోయినట్లు అనిపించింది . స్నేహితులిగా చేసిన వారిలో ఎవరినీ పాయింట్ అవుట్ చెయ్యలేము . పాత్రల పరిధి మేరకు చాలా చక్కగా నటించారు . ముఖ్యముగా పార్ట్ 4 లో వచ్చే చేతబడి సీన్ లో రఘు నటన అధ్బుతం .
విక్టర్ కేమెర చాలా ఆహ్లాదంగా ఉంది . కంటికి ఇంపుగా ఫ్రేం సెట్ చెయ్యటం దర్శకుడి సృజనాత్మకతకు అద్దం పడుతోంది . శ్రవణ్ అందించిన సంగీతం , ఒక పాట సరిగ్గా అతికినట్లు సరిపోయాయి . వనరులు పరిమితంగా ఉండటం వలన కాలేజ్ కాంపస్ ను పూర్తి గ , విద్యార్ధులతో నిండుగా చూపించలేకపోయారు . హీరోయిన్ చాలా ఫ్రెష్ గా , అందముగా ఉంది . చక్కగా నటించింది కూడా . అసందర్భముగా ప్రవేశించి తరువాత కనిపించకుండా పోవటమే కాక కధలో తన పాత్ర పరిమితం . అసలు అవసరం లేదు కూడా అని నా అభిప్రాయము . మరీ సీరియస్ గా ఉండకుండా కొంచం రిలాక్స్ గా ఉండటం కోసం దర్శకుడు హీరోయిన్ ను జోప్పించాడని నా అభిప్రాయము .
చాలా స్వల్ప వనరులతో తీసిన ఈ సినిమాలో లోటు పాతులను వెతకటం మూర్ఖత్వం అని తెలిసినప్పటికీ , మంచి ప్రయత్నంలో చిన్న పొరపాట్లను ఎత్తి చూపిస్తే రాబోయే ప్రయత్నాలలో వాటిని సరిచేసుకుంటా రన్న ఆశతో చెప్పటం జరిగింది .
ఒకటి మాత్రం నిజం. బాబులు , దత్తులు , కత్తులు , బిల్డ్ అప్ లు , బొడ్లు, తొడల తో నిండి ఉన్న తెలుగు చిత్ర సీమలో ఎవరైనా అభిరుచి ఉన్న నిర్మాత ఈ టీం కు ఒక్క అవకాశమిస్తే .. మన తెలుగు ప్రేక్షకులకు వీళ్ళు ఒక మంచి సినిమా ను అందిస్తారనే నమ్మకం నాకుంది ... సినిమా చూసి మీకనిపిస్తే ఇంకొక పది మందికి చెప్పండి . కొత్త వాళ్ళ ప్రతిభను ప్రోత్సహిస్తే మనకు చివరకు మిగిలేది మంచి తెలుగు సినిమా కాబట్టి ఈ ప్రయత్నాన్ని మరొక్కసారి మనస్పూర్తిగా అభినందిస్తూ , రఘు కు మంచి భవిష్యత్తు కలగాలని కోరుకుంటూ ..సెలవు
1 కామెంట్:
మీ అమూల్యమైన టైం లో ఈ షార్ట్ ఫిలిం కి కూడా రివ్యూ రాసినందుకు కృతజ్ఞులము ...!!!
కామెంట్‌ను పోస్ట్ చేయండి