13, జనవరి 2012, శుక్రవారం

Business man - Review ( My Take)

ఆ మధ్య ఎవరో ఫ్రెండ్ .. పూరి జగన్నాథ్  అప్పుల్లో ఉన్నాడని , చాల దగ్గరగా  ఉండేవాళ్ళు మోసం చేసి అతని డబ్బంతా కాజేసారని  చెప్పారు . నేను  పెద్దగా పట్టించుకోలేదు . పూరి జగన్నాథ్ నాకు పేస్ బుక్ ఫ్రెండ్ . అతని అప్పు తీర్చే డబ్బు నా దగ్గర లేదు. ఇంకొక కారణం ఏంటంటే .. సినిమా ఫీల్డ్ లో ఇలాంటి రూమర్లు మామూలే .. అని లైట్ తీస్కున్నా.. కానీ ఈ రోజు  బిజినెస్ మాన్  సినిమా చూసాక  అది నిజమేనేమో  అనిపించింది. దగ్గర ఉన్న మనుషులు నమ్మించి గొంతుకొస్తే  ఆ బాధ లోంచి బిజినెస్ మాన్ స్క్రిప్ట్ వచ్చిందేమో  అనిపించింది ..

ఇక సినిమా విషయానికొస్తే ... బాగా మేధావితనంగా , కురసోవా , స్పీల్బర్గ్ , ఇంటర్ నేషనల్  సినిమాలు చూస్తూ తెలుగు సినిమా లో లోపాలను వెతుకుతూ , అన్ని సినిమాలను తిట్టుకునేవాళ్ళు చూడవలసిన సినిమా కాదు ఇది . అన్ని టెన్షన్ లు మర్చిపోవడానికి  సినిమా కు వచ్చే సగటు ప్రేక్షకుడికి  ..మాంచి వర్షం పడుతున్నప్పుడు  దొరికే ఉల్లిపాయ పకోడీ లాంటిది ఈ సినిమా . బాక్స్ ఆఫీసు రికార్డ్స్ బద్దలు కొడుతుందో లేదో తెలీదు కానీ ...సూపర్ హిట్ , కమర్షియల్ హిట్ అవుతుంది అని నా అంచనా ..... కాని తెలుగు  ప్రేక్షకులు  ఒక సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారో ... పిరమిడ్ పుట్టుక కన్నా పెద్ద మిస్టరీ కాబట్టి ... కొన్నాళ్ళు వేచి చూడాలి ...


ఇక కధ విషయానికొస్తే .... భూమి పుట్టక ముందు నుంచి ఉన్న  పగ, ప్రతీకారం... కుటుంబాన్ని  నాశనం చేసిన విలన్ ను మట్టికరిపించడం అనే పాత ప్రియ పచ్చడి కధ. కాని ఓపెనింగ్ నుంచి ఎక్కడా బోరు కొట్టకుండా ..ఆద్యంతం  రక్తి కట్టించాడు దర్శకుడు .. పూరి జగన్నాథ్ ,  బయటకు కనిపించేటంత  జోవియల్ కాదని ....చాలా వేదాంతం అతని మనసులో ఉందని  ఈ సినిమా డైలాగులు మనకు చెప్తాయి.  మహేష్ బాబు మొత్తం తన భుజాల మీద వేస్కుని సినిమా ను నడిపించాడు .  మనుషుల్లోని హిపోక్రసీ , మనుషుల్లోని  స్వార్ధం చూసి .... వాటివల్ల బాధపడి ..సమాజం తో ఆడుకుని..దాని దూల దీర్చేయ్యాలని కోరుకునే యువకుడు మహేష్ ... ఇక మిగతా కధ వెండి తెరమీద చూడండి .
సినిమాలో బలం ... పూరి జగన్నాథ్  మాటలు, ఒక పర్సనాలిటీ డెవలప్మెంటు పుస్తకం చదువుతున్నట్ట్లుగా ఉంటుంది సినిమా చూస్తుంటే .... చాలా సార్లు మనల్ని మనం చూసుకుంటాం ...అల రాసాడు మాటలు .. ఇక మహేష్ ..చాలా బాగా పలికాడు .. లాజిక్కుల కోసం ఆలోచించడం మానేస్తే  నాజర్ ,  కాజల్  పాత్రలు బాగా కుదిరాయి. కాజల్ ఫ్రెండ్ గా చేసిన అమ్మాయి (ఆంటి కూడా అనుకోవచ్చు) బాగా చేసింది . కెమెరా  చాలా బావుంది . అలీ కామెడీ లేకుండా , అసలు పెద్దగా కామెడి లేకుండా సినిమాను చూపించిన పూరికు హాట్స్ ఆఫ్ ..


తమన్ కు కొద్ది రోజులు రెస్ట్ తీసుకోవటానికి అవకాశం ఇస్తే తను సొంత ట్యూన్లతో మనకు సంగీతం ఇస్తాడు ... రికీ మార్టిన్ , లయన్ కింగ్  థీం సాంగ్ , కొన్ని హిప్ హోప్ పాటలను స్టూడియో లో రుబ్బి మనకు అందించాడు .. ఇక పోతే  రాజ సుందరం కూడా కొద్ది రోజులు మహేష్ బాబు కు డాన్సు కంపోసు చెయ్యకుండా ఉంటె మంచిది ... అవే స్టెప్పులు చూసి చూసి  బోర్ వస్తోంది సార్... 


చాలా సీన్లు పోకిరి ను గుర్తు తెచ్చాయి . హీరోయిన్ చూస్తుండగా హీరో రౌడీ లను కాల్చి చంపటం... ఐటెం సాంగ్ అవుతుండగా ఫోన్ రావటం ..... భాయి , భాయి  అన్న మాఫియా డాన్స్  పేర్లు,  బ్రహ్మ్మాజీ  ను  సరిగ్గా ఉపయోగించుకోకపోవటం .... క్లైమాక్స్  లో ఒక్కసారే సినిమా అయిపోవటం ... చిన్న చిన్న పాయింట్లు ...కానీ సగటు ప్రేక్షకుడికి కావలసిన అన్ని అంశాలు పుష్కలంగా ఉన్నాయి ... దేశంలో కళను ఉద్దరిద్దామనుకుని ఎవడూ సినిమాలను తీయటం లేదు కాబట్టి ... పూరి జగన్నాథ్ దీనిని ఆస్కార్ కు పంపించడు కాబట్టి ... రెండు సార్లు హ్యాపీ గా  చూడవచ్చు .  


మర్చిపోయాను ..... సెన్సార్ వాళ్ళు ఈ సినిమాతో కొత్తగా క్లోజ్ అప్ లో కనిపించే  డాన్సర్లు మరియు హీరోయిన్  అందాలను బ్లర్ చేసి చూపించారు ...తెలుగు సంస్కృతిని కాపాడటానికి వారు చూపించే శ్రద్ధ .... వారి ఇంట్లో వాళ్ళ పిల్లలు  చూసే బూతు వెబ్ సైటులు చూడకుండా చూపిస్తే బావుంటుంది ...అందరికి అన్నీ తెలుసు ఈ రోజుల్లో... 8 వ తరగతి కుర్రాళ్ళు కడుపులు చేస్తున్న ఈ రోజుల్లో వీళ్ళకు ఈ మూలసంక ఎందుకో నాకు అర్ధం కాలేదు ....


మొత్తానికి బిజినెస్ మాన్ బాగా బిజినెస్ చేస్తాడు ....100 % చూడతగిన సామాన్యుడి మూవీ ఇది .... సర్వేజనా సుఖినోభవంతు ...